కొంచెం.. కొంచెం.. : ‘ఎఫ్‌-2’ రివ్యూ

F2 Moview Review

Share It!

సంక్రాంతి సంబరాల్లో భాగంగా విడులయిన సినిమాల్లో ‘ఎఫ్‌-2’ ఒకటి. నిన్న, మొన్న విడుదలయిన సినిమాలపై చర్చ జరుగుతుండగానే శనివారం మరో సినిమా విడుదలై ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి థియేరల్లోకి వచ్చింది. విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌లు కలిసి మల్టీస్టార్‌ చేసిన ఈ సినిమాపై పెద్ద హోప్‌ లేకపోయినా కామెడీ సినిమా అని ప్రచారం జరిగింది. అయితే అనిల్‌రావిపూడి దర్శకత్వంపై కొందరు నమ్మకం పెట్టుకున్నారు. ఆయన ఇదివరకు తీసిని సినిమాలు ఓ మోస్తారు విజయం సాధిండంతో ‘ఎఫ్‌-2’ కూడా విజయాన్ని తెచ్చిపెడుతుందని అందరు భావించారు. అయితే శనివారం విడుదలయిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం. 
కథ:
ఓ ఎమ్మెల్యే దగ్గర పీఏగా వెంకీ(వెంకటేశ్‌) పనిచేస్తుంటాడు. అతనికి మాట్రిమోనీ ద్వారా వచ్చిన సంబంధంలో హారిక(తమన్నా)తో పెళ్లి అవుతుంది. పెళ్లయిన కొత్తలో వీరి సంసారం సాఫీగానే సాగుతుంది. అయితే ఆ తరువాత వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభం అవుతాయి. భార్య పెట్టే టార్చర్‌ తట్టుకోలేకపోతుంటాడు. ఈక్రమంలో హారిక చెల్లెలు హాని(మెహ్రీన్‌)ను ప్రేమించిన వరుణ్‌(వరుణ్‌తేజ్‌) వెంకీకి తోడవుతాడు. వరుణ్‌కు పెళ్లికాకముందే హానీతో వేధింపులు మొదలవుతాయి.ఈ సమయంలో వెంకీతో కలిసి విదేశీ టూర్‌కు వెళుతాడు. అయితే ఇలా అర్ధాంతరంగా విడిచి వెళ్లిన వీరిని మళ్లీ హారిక, హానీలు ఎలా కాంప్రమైజ్‌ అవుతారనేది వెండితెరపై చూడాల్సిందే. 
విశ్లేషణ: 
అనుకున్నట్లుగా ‘ఎఫ్‌-2’ కామెడీ ప్రధానంగా సాగుతుంది. యువదర్శకుడు అనిల్‌రావిపూడి ఇదివరకు ‘పటాస్‌’, ‘సుప్రీమ్‌’, ‘రాజా ది గ్రేట్‌’ సినిమాలతో వైవిధ్యాన్ని సంపాదించుకున్నాడు. వీటిలో పటాస్‌ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం కామెడీరోల్‌లో విజయం సాధించిన సినిమా. అయితే వీటిలోని సారాంశం మొత్తమే ‘ఎఫ్‌-2’ అని అర్థమవుతుంది. కాకపోతే కామెడీ కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులు తాము పెట్టి డబ్బులు వృథా అయ్యాయని మాత్రం ఫీల్‌ కారు. అయితే ఈ  కామెడీ తతంగమంతా ప్రథమార్థం వరకే. మళ్లీ సెకండాఫ్‌ వచ్చే సరికి సినిమా సాధారణమై పోతుంది. ప్రేక్షకులు ఊహించిన డైలాగ్‌లే రిపీట్‌ అవుతుంటాయి. ఈ సినిమా మొత్తం వెంకీతోనే నడుస్తుంది. ఒక దశలో వెంకీ లేకపోతే సినిమా పరిస్థితి వేరే ఉండేది. 
 మొత్తంగా ‘భార్య బాధితుడు’ వెంకీ.. ప్రియురాలి బాధితుడు వరుణ్‌లు చేసిన కామెడీ ప్రధానంగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల మాత్రం కన్వ్యూజింగ్‌ కామెడీతో ప్రేక్షకులను కొంచెం కష్టపెట్టారు. కాబోయే తోడల్లుడిని పట్టుకోవడం యూరఫ్‌కు ట్రిప్పు వేయడం… దీంతో వీరిని హీరోయిన్లు వదిలేయడం.. వారు మరో వ్యక్తులను ఎంచుకోవడం చూస్తే కథ ఎటు వెళ్తుందో అర్థం కాకుండా ఉంటుంది. 
ఎవరెలా చేశారంటే..
ఫ్యామిలీ సినిమాలకు పెట్టింది పేరు వెంకీ. అనుకున్న స్థాయిలో కామెడి పండించడంలో వెంకీ సఫలమయ్యాడు. అయ్యాడు. అయితే వెంకీకి ఇంకా సరైన డైలాగ్‌లు ఇవ్వడంతో రైటర్‌ కాస్త పదును పెట్టాల్సింది. అక్కడక్కడా చాలా చీఫ్‌ డైలాగ్‌లను వెంకీ అనడం సబబు అనిపించదు. తెలంగాణ యాసతో వరుణ్‌ చాలా కష్టపడ్డాడు కానీ కామెడీలో కలిసిపోవడం వరుణ్‌కు షూటవ్వలేదు. దీంతో అతనికి లవ్‌ యాంగిల్‌ సినిమాలు మాత్రమే వర్కఅవుట్‌ అవుతాయని తెలుస్తుంది. కాకపోతే వరుణ్‌ ఫ్రెండ్‌ ప్రియదర్శన్‌ బాగా నవ్వించాడు. రాజేంద్రప్రసాద్‌కు సరైన క్యారెక్టర్‌ అయినా మెప్పించలేకపోయాడు. ఇక సీనియర్‌ నటి అన్నపూర్ణ తన వంతు న్యాయం చేసింది. హీరోయిన్లు తమ పాత్రలకు న్యాయం చేశారు. 
సాంకేతిక వర్గం: 
గతంలో భార్య బాధితుల సినిమాలు వచ్చాయి. కానీ పెద్దగా ఆడలేదు. కానీ అనిల్‌ రావిపూడి సినిమాలో మాత్రం ప్రధానంగా ఈ రోల్‌నే తీసుకున్నాడు. కథ పరంగా అందరిని మెప్పించినా దానిని మలచడంలో కాస్త కన్వ్యూజన్‌ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు వస్తున్న సినిమాల్లో కామెడీ కరువవుతోంది. కామెడీ విషయంలో మాత్రం అనిల్‌ సరైన న్యాయం చేశాడు. ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన దేవిశ్రీ మరోసారి విఫలమయ్యాడు. 

Share It!