ఎన్టీఆర్ ‘అరవింత సమేత’ ఫొటో లీక్‌..!! షాకిచ్చిన ఎన్టీఆర్

Share It!

యాక్షన్‌తో పాటు లవ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో వస్తున్న ‘అరవింత సమేత వీర రాఘవ’ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫ్యాక్షన్‌ డ్రామాలో వస్తుందని ఇదివరకే వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్‌ ఇదివరకు తీసిన సినిమాల కంటే దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని టైం వేస్ట్‌ చేయడంగా చకాచకా పనులు సాగిస్తున్నాడు.
కాగా ఈ సినిమా నుంచి ఓ ఫోటో లీకై సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగా నటుడు నాబాబుతో కలిసిన గాయాలతో ఓ జీపులో వెళ్తున్న ఫొటో బయటికి రావడంతో అభిమానులు షేర్ల మీద షేర్లు చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ఊహించని రీతిలో నటిస్తాడంటూ ప్రచారం చేస్తున్నారు.
ఇందులో నాగబాబు ఫ్యాక్షన్‌ లీడర్‌  నటిస్తానడి ప్రచారం ఉంది. అందులోనూ ఎన్టీఆర్‌కు తండ్రి పాత్రలో పోషించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నాగబాబు ఇదివరకే ఎన్నో సినిమాల్లో తండ్రి పాత్రలో నటించి మెప్పించాడు. అయితే ఎన్టీఆర్‌కు తండ్రిగా అందులోనూ ఫ్యాక్షన్‌ లీడర్‌గా నటించడం కొత్త కాబట్టి ఎలా ఉంటాడోనని మెగా అభిమానులు ఎదురు చేస్తున్నారు. భారీ తారగణం ఉన్నందువల్ల సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఈ వేడిని చూసి సినిమా డిస్ట్రిబ్యూటర్లు సైతం ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. కాగా ఫోటో ఎడిటింగ్‌ రూం నుంచి లీకైందని చెబుతున్నారు. అయితే సినిమా స్టేటస్‌ పెంచేందుకే ఇలా చేశారా అని వార్తలు వస్తున్నాయి. ఏదీ ఏమైనా త్రివిక్రమ్‌, జూనియర్‌ల కాంబినేషన్లో తప్పకుండా సినిమా హిట్టవుతుందని సినీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

Share It!

shares