ఫ్యాన్స్‌ను మాత్రమే మురిపించిన ‘పెటా’: రివ్యూ

Peta Movie Review

Share It!

సూపర్‌ స్టార్‌రజనీ కాంత్‌కు కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగులోనూ ఫ్యాన్స్‌ ఎక్కువ మందే ఉన్నారు. ఒకప్పుడు రజనీ సినిమాలో తమిళంలో ఆడిన తరువాత తెలుగులో రిలీజ్‌ అయ్యేవి. కానీ తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదలవుతుందంటే ఆయనకున్న క్రేజీని అర్థం చేసుకోవచ్చు. సినిమాలో కథ ఎలా ఉన్నా ఆయన స్టైల్‌ కోసం చూసేవారు ఎందరో ఉన్నారు. రజనీ అంటేనే స్టైల్‌. స్టైల్‌ అంటేనే రజనీ అనే స్థాయిలో ఫ్యాన్స్‌ ఇప్పటికీ ఆయన సినిమాలను ఇష్టపడేవారు ఎందరో ఉన్నారు. ఈ పరిస్థితి అర్థం చేసుకున్న మన తెలుగు నిర్మాతలు సంక్రాంతి పోరులో భాగంగా గురువారం రజనీ నటించిన ‘పెటా’ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. 
కథ
కాళీ(రజనీ) అనే వ్యక్తి హాస్టల్‌లో వార్డెన్‌గా పనిచేస్తాడు. అక్కడి సమస్యలను తనదైన శైలిలో పరిష్కరించేందుకు కృషి చేస్తాడు. ఓ ప్రేమ జంటను కలిపేందుకు కూడా కృషి చేస్తాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఓ రౌడితో గొడవ పడుతుంటాడు. దీంతో ఆయన కాళీ అనే వ్యక్తి అసలు పేరు ‘పెటా’ అని ఆయనది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రమని స్థానికులకు అర్థమవుతుంది. అయితే ఆ తరువాత పెటా స్టోరీ ఎలా సాగుతుంది..? కాళీగా ఆయన అవతారం ఎత్తాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది తెరపై చూడాల్సిందే. 
విశ్లేషణ:
రజనీ సినిమా అంటే అందరికీ తెలిసిన విషయమే. స్టైల్‌కు మారుపేరుగా నిలిచే ఆయన స్టోరీలన్నీ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. ఈ సినిమా కూడా దాదాపు అలాగే ఉంది. రజనీ ఇదివరకు నటించిన నరసింహా, ముత్తు తదితర సినిమాలన్నీంటిలోని సన్నివేశాలు ఇందులో కనిపిస్తాయి. పస్టాఫ్‌ పూర్తయ్యే సరికి రజనీ ఫ్యాన్స్‌ను మెప్పించారు గానీ.. అసలు కథలోకి వెళ్లరు. ఆయన మొదటి పార్ట్‌ మొత్తమంతా రజనీ స్టైల్‌కే అంకితం చేశారు. అయితే రెండో పార్టులో ఆయన స్టోరీ ప్రారంభం అయినా కొత్తదనేమేమి కనిపించే అవకాశాలు లేదు. అయితే పెటాగా రజనీ కొత్తలుక్‌లో కనిపించి అలరించాడు. పంచెకట్టు, మీసాలతో కనిపించి ఫ్యాన్స్‌ను మెప్పించాడు. 
ఎవరెలా నటించారంటే..:
రజనీ ఏజ్‌ ఎక్కువైనా కుర్రాడిలా నటించి మెప్పించారు. ఆ వయసులో ఫ్యాన్స్‌ను మెప్పించే ఒకే ఒక హీరో రజనీ అని చెప్పవచ్చు. ఇక సిమ్రాన్‌, త్రిషలు తమ పాత్రలకు ప్రాధాన్యం లేకపోయినా బాగానే నటించారు. విలన్‌గా విజయ్‌సేతపతి, నవజుద్దీన్‌ సిద్ధిఖీలు ఈ సినిమాలో నటించడంలో ఫెయిలయ్యారనే చెప్పవచ్చు. 
సాంకేతిక వర్గం:
యువ దర్శకుడు కార్తీక్‌ సుబ్బారాజ్‌ రజనీ అవకాశం ఇచ్చాడంటే ఆయన ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. అయితే కార్తీక్‌ సుబ్బారాజు కూడా పాత డైరెక్టర్ల మాదిరిగా రజనీ స్టైల్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. స్టోరీని పట్టించుకోలేదు. బ్యాక్‌రౌండ్‌ మ్యూజిక్‌తో అనిరుద్‌ ఆకట్టుకున్నాడు.

Share It!