కళాఖండం.. ‘వినయ విధేయ రామ’ రివ్యూ..

Vinaya Vidheya Rama Movie Review

Share It!

ఒకప్పుడు కేవలం లవ్‌ యాంగిల్స్‌లోనే కనిపించిన రామ్‌చరణ్‌ రాను రాను పూర్తిగా మాస్‌ హీరోగా మారిపోయాడు. కథలకు తగ్గట్టుగా ఆయన కనెక్ట్‌ కావడంతో అభిమనులు కూడా ఆస్వాదిస్తున్నారు. ఆయన బాడీ బిల్డింగ్‌కు అనుగుణంగా దర్శకులు సైతం అందుకు తగ్గట్టుగానే సినిమా కథలు రాస్తున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో చిట్టిబాబు పాత్ర వేసిన రామ్‌చరణ్‌ కామెడీని పండించినా పూర్తిగా మాస్‌ హీరోనే అనిపించుకున్నాడు. దీంతో ఆ తరువాత ఆయనతో బోయపాటి తీసిన సినిమా ‘వినయ విధేయ రామ’ సినిమాలోనూ రామ్‌చరణ్‌ పూర్తి మాస్‌ హీరో అనిపించుకున్నాడు. శుక్రవారం విడుదలయిన ఆ సినిమా విశేషాలేంటో చూద్దాం. 
కథ:
ఓ కుటుంబంలో అందరి కంటే చిన్నవాడైన రామ్‌ (రామ్‌చరణ్‌) అంటే మిగతావారికి ప్రాణం. అలాగే రామ్‌ కూడా కుటుంబం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అదే సమయంలో ఎలక్షన్‌ కమిషనర్‌ అయిన రామ్‌ అన్నయ్య( ప్రశాంత్‌) పందెం పరుశురామ్‌(ముఖేశ్‌ రుషి)తో గొడవ పడుతాడు. దీంతో రామ్‌ కుటుంబంపై పగ తీర్చుకోవడానికి బీహార్లో ఉన్న మున్నాభాయ్‌(వివేక్‌ఒబేరాయ్‌)ని రప్పిస్తాడు. ఆ తరువాత జరిగే పొరాట సన్నివేశాలను తెరపై చూడాల్సిందే. 
విశ్లేషణ: 
మిగతా కథల్లాగే ఇది రివేంజ్‌ కథ అని తెలిసినా అక్కడక్కడా కొత్తదనం కనిపిస్తుంది. ముఖ్యంగా రామ్‌చరణ్‌ తన బాడీబిల్డింగ్‌ను ప్రదర్శించి పూర్తిగా యక్షన్‌ చేశాడు. సాధారణంగా బోయపాటి సినిమా అంటే ఫ్యామిలీ బ్యాక్‌ డ్రాప్‌తో పాటు యాక్షన్‌ సీన్స్‌ ఉంటాయని అందరికీ తెలుసు. అలాగే ఇందులో కూడా అలాంటివే కనిపిస్తాయి. ప్రథమార్థం మొత్తం ఫ్యామిలీని పరిచయం చేస్తూ ప్రేమ పాఠాలతో గడిచిపోతుంది. ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది. అయితే ద్వితాయార్థం మొత్తం యాక్షన్‌తో కూడిన సీన్స్‌ ఉంటూ ఎక్కువ శాతం ఫైట్స్‌కే కేటాయించాడు బోయపాటి. ద్వితీయార్థంలోనూ ఫ్యామిలీతో పాటు అక్కడక్కడా కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండే బాగుండేది. 
ఎవరెలా చేశారంటే..:
రామ్‌చరణ్‌ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. యాక్షన్‌తో అభిమానులను మెప్పిస్తాడు. ఇదివరకు వచ్చిన సినిమాలో కంటే ఇందులో రామ్‌చ కొంచెం భారీ లుక్‌లో కనిపించనున్నాడు. ప్రశాంత్‌, స్నేహలు తమ పాత్రల్లో అలరిస్తారు. ఇక వివేక్‌ ఒబేరాచ్‌ విలన్‌ పాత్రలో మెప్పించాడు. 
సాంకేతిక వర్గం:
బోయపాటి సినిమాలంటే ఇలానే ఉంటాయనే విధంగానే తీసుకెళ్లాడు. అయితే రివేంజ్‌ సినిమాలాగా కాకుండా కొత్తదనం ఆలోచిస్తే బాగుండునని అందరు అనుకుంటున్నారు. భారీ యాక్షన్‌కు అవసరమైన హంగులన్నీ ఏర్పాటు చేసిన బోయపాటి కథ విషయంలో శ్రద్ద వహించడమెందుకనే వాదన వినిపిస్తోంది. 

Share It!